బస్సుయాత్రకు నిరసన సెగ

సీఎం జగన్‌ ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రకు శనివారం కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో నిరసన సెగ ఎదురైంది.

Published : 31 Mar 2024 04:53 IST

ఈనాడు, కర్నూలు, తుగ్గలి, న్యూస్‌టుడే: సీఎం జగన్‌ ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రకు శనివారం కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో నిరసన సెగ ఎదురైంది. జొన్నగిరి శివారులోని బీసీ కాలనీ వద్దకు సీఎం బస్సు రాగానే.. పెద్ద ఎత్తున కాలనీవాసులు అక్కడికి చేరుకున్నారు. ‘తాగునీటికి ఇబ్బంది పడుతున్నాం... మా సమస్యను పరిష్కరించండి’, ‘జొన్నగిరి చెరువును నింపండి’ అని నినదించారు. సమస్యను అధికారులు, నాయకులు, ఎమ్మెల్యేకు వివరించినా.. ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ముఖ్యమంత్రి బస్సు దిగి వచ్చి మహిళలు, వృద్ధులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

అంతకుముందు నీటి సమస్యను ముఖ్యమంత్రికి చెప్పేందుకు గ్రామస్థులు ఖాళీ బిందెలతో వస్తుండగా.. అక్కడ బందోబస్తులో ఉన్న పోలీసులు అడ్డుకున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి గత ఏడాది 77 చెరువులను నింపే కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. ఆ సందర్భంగా జొన్నగిరి చెరువుకు పైపులైను వేస్తామని చెప్పినా కార్యరూపం దాల్చలేదు. దీంతో గ్రామానికి తాగునీరు, 200 ఎకరాలకు సాగునీరు ప్రశ్నార్థకంగా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని