శ్రీకాకుళం జిల్లాలో తెదేపాలో చేరికలు

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం భావనపాడులో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడి సమక్షంలో ఆ పార్టీలో భారీగా చేరికలు జరిగాయి.

Published : 31 Mar 2024 05:32 IST

టెక్కలి, సంతబొమ్మాళి, న్యూస్‌టుడే: శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం భావనపాడులో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడి సమక్షంలో ఆ పార్టీలో భారీగా చేరికలు జరిగాయి. మాజీ సర్పంచులు సైని గురువులు, అల్లుపల్లి పోతయ్య, సొసైటీ మాజీ అధ్యక్షుడు గొడగల ఆదినారాయణతో పాటు వైకాపాకు చెందిన 150 కుటుంబాలు శనివారం తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నాయి. అంతకు ముందు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్‌నాయుడు.. కస్పానౌపడా మూడు రోడ్ల కూడలి నుంచి పార్టీ శ్రేణులు నిర్వహించిన ద్విచక్ర వాహన ర్యాలీతో ప్రచారం నిర్వహిస్తూ ముందుకు సాగారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని