ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి మద్దతు లేకుంటే గెలవలేం

‘వేంకటేశ్వరస్వామి సాక్షిగా.. ప్రస్తుత ఎన్నికల్లో మేం గెలిచిన తర్వాత మహీధర్‌రెడ్డి మాటే వేదంగా భావిస్తాం. ఆయన ఆలోచనలు, సూచనలు తప్పకుండా పాటిస్తాం’ అని నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

Published : 31 Mar 2024 05:35 IST

విజయసాయిరెడ్డి

కందుకూరు పట్టణం, న్యూస్‌టుడే: ‘వేంకటేశ్వరస్వామి సాక్షిగా.. ప్రస్తుత ఎన్నికల్లో మేం గెలిచిన తర్వాత మహీధర్‌రెడ్డి మాటే వేదంగా భావిస్తాం. ఆయన ఆలోచనలు, సూచనలు తప్పకుండా పాటిస్తాం’ అని నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరులో శనివారం స్థానిక ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి, ఆయన అనుచరులు విజయసాయిరెడ్డితో ఆత్మీయ పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ కందుకూరులో ఎప్పుడూ 5వేల లోపు మెజారిటీతో గెలుపు ఉంటుందని, ప్రస్తుత ఎన్నికల్లో మహీధర్‌రెడ్డి మద్దతు లేకుంటే తనతోపాటు ఎమ్మెల్యే అభ్యర్థి బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ గెలుపు కష్టమవుతుందన్నారు.మహీధర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక రాజకీయాల్లో తాను ముందుకు నడవలేకపోయానన్నారు. శాసనమండలిలో అడుగుపెట్టే ఉద్దేశం తనకు లేదని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు