నెల్లూరు ఎస్పీ మామ విజయసాయిరెడ్డి అనుచరుడు

నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి మామ గురవారెడ్డి.. వైకాపా అభ్యర్థి విజయసాయిరెడ్డి అనుచరుడని, అధికార పార్టీలో కీలక నేత అని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తెలిపారు.

Published : 31 Mar 2024 05:16 IST

ఎస్పీ నివాసంలోనే వైకాపా నాయకులకు భోజనం, వసతి
ఈసీకి వర్ల రామయ్య ఫిర్యాదు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి మామ గురవారెడ్డి.. వైకాపా అభ్యర్థి విజయసాయిరెడ్డి అనుచరుడని, అధికార పార్టీలో కీలక నేత అని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తెలిపారు. దీంతో ఎస్పీ నివాసం వైకాపా క్యాంపు కార్యాలయంలా మారిందని ఆరోపించారు. డీజీపీ రాజేంద్రనాథరెడ్డి సహకారంతో కొందరు పోలీసులు వైకాపాకు దాసోహం అయ్యారన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనాకు శనివారం ఆయన ఫిర్యాదు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ‘గురవారెడ్డి గతంలో జడ్పీటీసీ సభ్యుడిగా పనిచేశారు. ఈ ఎన్నికల్లో వైకాపాను గెలిపించాలని కంకణం కట్టుకున్నారు. ఎన్నికల ప్రచారం ముగియగానే ఆయనతో కలిసి వైకాపా నాయకులు ఎస్పీ ఇంటికి వెళుతున్నారు. అక్కడే భోజనం చేసి వసతి పొందుతున్నారు. వెంటనే ఎస్పీని బదిలీ చేసి ఎన్నికల విధులకు ఆయనను దూరంగా ఉంచాలి’ అని వర్ల రామయ్య డిమాండ్‌ చేశారు. వైకాపాకు ఓటేయకపోతే దేశం విడిచి వెళ్లలేరని ఎన్నారైల్ని బెదిరించిన బాపట్ల జిల్లా, వేమూరు వైకాపా అభ్యర్థి అశోక్‌బాబును అనర్హుడిగా ప్రకటించాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని