విశాఖ జిల్లాలో వైకాపాకు షాక్‌

పశుగణాభివృద్ధి సంఘం విశాఖ జిల్లా ఛైర్మన్‌, భీమిలి మండల వైకాపా జడ్పీటీసీ సభ్యుడు గాడు వెంకటప్పడు తన అనుచరులతో కలిసి ఆ పార్టీకి రాజీనామా చేశారు.

Updated : 01 Apr 2024 06:44 IST

ఆ పార్టీ భీమిలి జడ్పీటీసీ సభ్యుడు సహా పలువురి మూకుమ్మడి రాజీనామా

విశాఖపట్నం(తగరపువలస), న్యూస్‌టుడే: పశుగణాభివృద్ధి సంఘం విశాఖ జిల్లా ఛైర్మన్‌, భీమిలి మండల వైకాపా జడ్పీటీసీ సభ్యుడు గాడు వెంకటప్పడు తన అనుచరులతో కలిసి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆదివారం విశాఖపట్నంలో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. వైకాపా హయాంలో కక్ష సాధింపులు తప్ప.. అభివృద్ధి దిశగా పాలన లేదని వ్యాఖ్యానించారు. అలాంటి పార్టీలో కొనసాగడం ధర్మం కాదనిపించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. తనతోపాటు సింగనబంద, మజ్జివలస, లక్ష్మీపురం, దాకమర్రి, తాళ్లవలస, నారాయణరాజుపేట, మజ్జిపేట, బోడమెట్టపాలెం పంచాయతీలకు చెందిన ఓ సర్పంచి, ఎంపీటీసీ సభ్యుడు, అయిదుగురు మాజీ సర్పంచులు, నలుగురు మాజీ ఎంపీటీసీ సభ్యులు, ముగ్గురు ఉప సర్పంచులు, 30 మంది వార్డుసభ్యులు, ఓ పీఏసీఎస్‌ డైరెక్టరు, మాజీ ఉపాధ్యక్షుడు, నలుగురు సచివాలయ కన్వీనర్లు సహా 100 మంది నేతలు వైకాపాను వీడుతున్నట్లు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు