ఎన్నికల్లో మంత్రి ధర్మానకు సహకరించం

ఈ ఎన్నికల్లో మంత్రి ధర్మాన ప్రసాదరావుకు, వైకాపాకు సహకరించకూడదని నిర్ణయించుకున్నామని అఖిలభారత యాదవ సంఘ ఉపాధ్యక్షుడు కలగ శ్రీనివాస్‌ స్పష్టం చేశారు.

Updated : 01 Apr 2024 06:55 IST

యాదవ సంఘ నాయకుల వెల్లడి

శ్రీకాకుళం (కలెక్టరేట్‌), న్యూస్‌టుడే: ఈ ఎన్నికల్లో మంత్రి ధర్మాన ప్రసాదరావుకు, వైకాపాకు సహకరించకూడదని నిర్ణయించుకున్నామని అఖిలభారత యాదవ సంఘ ఉపాధ్యక్షుడు కలగ శ్రీనివాస్‌ స్పష్టం చేశారు. యాదవులపై మంత్రి వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు. శ్రీకాకుళంలోని పెద్దపాడులో యాదవ సంఘ సభ్యులు ఆదివారం సమావేశమయ్యారు. శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ‘నియోజకవర్గంలోని యాదవ సామాజికవర్గానికి ఈ ప్రభుత్వం కనీసం నామినేటెడ్‌ పదవి కూడా ఇవ్వలేదు. అభివృద్ధి పనులు చేస్తారని ఎదురుచూసినా ఫలితం లేదు. గడిచిన ఎన్నికల్లో ధర్మాన విజయానికి ఎంతో కష్టపడ్డాం. రామలక్ష్మణ కూడలి నుంచి పెద్దపాడు వరకు రహదారి విస్తరించాలని అడిగినా చర్యలు లేవు. గ్రామస్థులు తెదేపాకు మద్దతు తెలపాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిపై త్వరలో మా నిర్ణయాన్ని వెల్లడిస్తాం’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని