క్వింటాకు రూ.500 బోనస్‌ ఇవ్వాలి

రైతులకు ఇచ్చిన ఎన్నికల వాగ్దానాల్ని అమలు చేయాలని... నీటి కొరత కారణంగా దెబ్బతిన్న పంటలకు పరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఎం డిమాండ్‌ చేసింది.

Published : 01 Apr 2024 04:58 IST

ఎకరాకు రూ.20 వేల పంట నష్ట పరిహారమివ్వాలి
సీపీఎం రాష్ట్ర కమిటీ తీర్మానాలు

ఈనాడు, హైదరాబాద్‌: రైతులకు ఇచ్చిన ఎన్నికల వాగ్దానాల్ని అమలు చేయాలని... నీటి కొరత కారణంగా దెబ్బతిన్న పంటలకు పరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఎం డిమాండ్‌ చేసింది. ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకున్న లక్ష పేద కుటుంబాలకు ఇళ్ల పట్టాలివ్వాలని... రైతుబంధు డబ్బులు ఇవ్వాలని కోరింది. ఆదివారమిక్కడ ఎంబీ భవన్‌లో సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశమై పలు తీర్మానాలు చేసింది. ‘కనీస మద్దతు ధరకు అదనంగా క్వింటాకు రూ.500 బోనస్‌ ఇస్తామని కాంగ్రెస్‌ ఎన్నికల వాగ్దానం చేసింది. వరి, మొక్కజొన్న, సోయా, పత్తి, జొన్నలు తదితర పంటలకు బోనస్‌తో పాటు కొత్తగా మిరప, పత్తి, పసుపు, ఎర్రజొన్నలకు మద్దతు ధర ప్రకటించారు. కానీ ఈ ధరలను అమల్లోకి తేలేదు. వాగ్దానం మేరకు మద్దతు ధరకు అదనంగా బోనస్‌ ఇవ్వాలి. రూ.2 లక్షల రుణమాఫీని అమలు చేయాలి...అలాగే ఎకరాకు రూ. 20వేల పంటనష్ట పరిహారం ఇవ్వాలి’ అని పార్టీ డిమాండ్‌ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని