కేసీఆర్‌ సమావేశంలో కరెంటు నిలిచిపోవడంపై చర్చ

సూర్యాపేటలోని భారాస కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతుండగా.. కొద్దిసేపు కరెంటు పోయింది.

Published : 01 Apr 2024 04:58 IST

కాంగ్రెస్‌ పాలనలో ఇంతేనన్న మాజీ సీఎం
అవాస్తవమన్న విద్యుత్‌శాఖ అధికారులు

భానుపురి, న్యూస్‌టుడే: సూర్యాపేటలోని భారాస కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతుండగా.. కొద్దిసేపు కరెంటు పోయింది. లైట్లు ఆరిపోగా.. మైక్‌ ఆగింది. దీనిపై కేసీఆర్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పాలనలో ఇలాగే ఉంటుందని అన్నారు. ఈ విషయం చర్చనీయాంశం కావడంతో విద్యుత్తు శాఖ ఎస్‌ఈ పాల్‌రాజు, డీఈ శ్రీనివాస్‌ స్పందించారు. భారాస కార్యాలయం బయట ఉన్న ఖాళీ స్థలంలో 16 కూలర్లు, 6 ఏసీలు, లైట్లు, లైవ్‌ కవరేజీ, సౌండ్‌ సిస్టమ్‌ కోసం 125 కేవీఏ డీజిల్‌ జనరేటర్‌ను పార్టీ తరఫున ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. విలేకరుల సమావేశానికి జనరేటర్‌ ద్వారానే కరెంటు సరఫరా ఇచ్చుకున్నారని వివరించారు. మైక్‌ కనెక్షన్‌లో చిన్న సమస్య ఉండటం వల్ల కేసీఆర్‌ మాట్లాడుతున్న సమయంలో ఆగిపోయిందని, అక్కడే ఉన్న ఎలక్ట్రీషియన్‌ వెంటనే సరిచేశారని, విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడిందనడంలో వాస్తవం లేదని వారు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని