తెలంగాణకు భాజపాతో ప్రమాదం

రాష్ట్రంలో భాజపా ప్రమాదం ముంచుకొస్తోందని సీపీఎం ఆందోళన వ్యక్తం చేసింది. మతోన్మాద వాతావరణాన్ని సృష్టించేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోందని, ఇందులో భాగంగానే ‘రజాకార్‌’ వంటి సినిమాల్ని విడుదల చేసిందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శించారు.

Published : 01 Apr 2024 04:59 IST

ఆ పార్టీకి ఒక్క సీటూ రాకుండా చూడాలి: బీవీ రాఘవులు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో భాజపా ప్రమాదం ముంచుకొస్తోందని సీపీఎం ఆందోళన వ్యక్తం చేసింది. మతోన్మాద వాతావరణాన్ని సృష్టించేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోందని, ఇందులో భాగంగానే ‘రజాకార్‌’ వంటి సినిమాల్ని విడుదల చేసిందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శించారు. ఆదివారం పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గతంలో అధికారంలో ఉన్న భారాస.. ఇతర పార్టీల నాయకుల్ని చేర్చుకుంటే, ఇప్పుడు కాంగ్రెస్‌ అదే పనిచేస్తోందని అన్నారు. భాజపాకు ఒక్క సీటు కూడా రాకుండా చూడాలని కాంగ్రెస్‌కు సూచించారు. ‘భాజపా ఓటమి భయంతోనే దిల్లీ సీఎం కేజ్రీవాల్‌, ఝార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌లను అరెస్టు చేయించింది. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ అనుకూలంగా ఉండటంతో ఆయన జోలికి వెళ్లలేదు’ అని రాఘవులు మండిపడ్డారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టును ఖండించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని