పవన్‌ కల్యాణ్‌కు స్వల్ప అస్వస్థత

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ రెండు రోజులుగా జ్వరం, దగ్గుతో బాధపడుతున్నారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్న పవన్‌ కల్యాణ్‌ వారాహి విజయభేరి షెడ్యూలును ముందస్తుగా ఖరారు చేయడంతో వాయిదా వేయడం ఇష్టంలేక హాజరయ్యారు.

Published : 01 Apr 2024 05:38 IST

ఈనాడు, కాకినాడ: జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ రెండు రోజులుగా జ్వరం, దగ్గుతో బాధపడుతున్నారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్న పవన్‌ కల్యాణ్‌ వారాహి విజయభేరి షెడ్యూలును ముందస్తుగా ఖరారు చేయడంతో వాయిదా వేయడం ఇష్టంలేక హాజరయ్యారు. ఆరోగ్యం సహకరించకున్నా వైద్యం పొందుతూనే శనివారం ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఆదివారం శక్తిపీఠాన్ని సందర్శించుకున్న అనంతరం జనసేన- తెదేపా- భాజపా నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించి శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అత్యవసర సమావేశం కోసం ఆదివారం సాయంత్రం హెలికాప్టర్‌లో హైదరాబాద్‌ వెళ్లిన పవన్‌కల్యాణ్‌.. సోమవారం ఉదయం మళ్లీ పిఠాపురం చేరుకుంటారని.. మిగిలిన రెండురోజుల పర్యటన పూర్తి చేస్తారని జనసేన వర్గాలు తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని