400 కాదు.. కనీసం 200 సీట్లైనా గెలవండి

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లు గెలుస్తామంటున్న భాజపా కనీసం 200 స్థానాల్లోనైనా విజయం సాధించి చూపెట్టాలని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సవాల్‌ విసిరారు.

Updated : 01 Apr 2024 06:09 IST

భాజపాకు మమతా బెనర్జీ సవాల్‌

కోల్‌కతా: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లు గెలుస్తామంటున్న భాజపా కనీసం 200 స్థానాల్లోనైనా విజయం సాధించి చూపెట్టాలని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సవాల్‌ విసిరారు. 2021 బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లోనూ 200 స్థానాలు గెలుస్తామన్న భాజపా 77 సీట్లకే పరిమితమైందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాకు మద్దతుగా కృష్ణానగర్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో మమత పాల్గొని ప్రసంగించారు. భాజపాకు వ్యతిరేకంగా మాట్లాడినందుకే మొయిత్రాపై దుష్ప్రచారం చేసి లోక్‌సభ నుంచి బహిష్కరించారని ఆరోపించారు. మళ్లీ ఆమెను కృష్ణానగర్‌ నుంచే బరిలో దించామని మమత పేర్కొన్నారు.

తూర్పు పాకిస్థాన్‌ నుంచి వలస వచ్చిన మతువా వర్గాలతో బెనర్జీ మాట్లాడుతూ..‘‘మతువా ప్రజలారా..నాపై నమ్మకం ఉంచండి. మీ పౌరసత్వాన్ని దూరం చేయనివ్వను. మీకు ప్రశాంతంగా జీవించాలని ఉంటే సీఏఏకు దరఖాస్తు చేయకండి’’ అని పేర్కొన్నారు.  బెంగాల్‌లో ఇండియా కూటమి లేదని, ఇక్కడ సీపీఎం, కాంగ్రెస్‌లు భాజపా కోసం పని చేస్తున్నాయని మమత ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని