ఆప్‌ కీలక నేత రాఘవ్‌ చడ్డా ఎక్కడా..?

ఆప్‌ కీలక నేత రాఘవ్‌ చడ్డా ఎక్కడా అని ఇండియా కూటమిలోని ఎన్‌సీపీ శరద్‌ పవార్‌ వర్గానికి చెందిన నేత జితేంద్ర అవ్హద్‌ ఎక్స్‌ వేదికగా ప్రశ్నించారు.

Published : 01 Apr 2024 06:04 IST

దిల్లీ: ఆప్‌ కీలక నేత రాఘవ్‌ చడ్డా ఎక్కడా అని ఇండియా కూటమిలోని ఎన్‌సీపీ శరద్‌ పవార్‌ వర్గానికి చెందిన నేత జితేంద్ర అవ్హద్‌ ఎక్స్‌ వేదికగా ప్రశ్నించారు. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టు వంటి పరిణామాలు చోటు చేసుకున్న సమయంలో ఆయన లేకపోవడం ఆ పార్టీకి ఇబ్బందికరమన్నారు. అయితే ఈ పోస్టు పెట్టిన నిమిషాల వ్యవధిలోనే దాన్ని తొలగించడం గమనార్హం. ‘ఆప్‌లోని అందరు నేతలు తెరపైకి వస్తున్నారు. ఆ పార్టీకి ముఖ చిత్రం వంటి రాఘవ్‌ చడ్డా మాత్రం కనిపించడంలేదు. ఆయన గైర్హాజరీ పార్టీ కార్యకర్తలను బాధిస్తోంది. రోజుల తరబడి కనిపించకపోవడం ప్రజలతో దూరాన్ని పెంచుతుంది. అతడు లండన్‌లో ఉన్నాడు. అందుకే మాట్లాడలేకపోయి ఉండొచ్చు. వీడియో సందేశం విడుదల చేస్తే బాగుండేది. ఆయన గైర్హాజరీపై మేము ప్రశ్నలు అడుగుతూనే ఉంటాం’ అని శనివారం ఓ ఆంగ్ల వార్తాపత్రిక వద్ద వ్యాఖ్యానించారు. రాఘవ్‌ చడ్డా దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుడు. మార్చి తొలి వారంలో నేత్ర వైద్యం నిమిత్తం లండన్‌ వెళ్లారు. ప్రస్తుతం అక్కడే ఉన్నారు. భారత్‌కు ఎప్పుడు వస్తారో స్పష్టత లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని