5వ తేదీలోగా పింఛన్ల పంపిణీ పూర్తి చేసేలా ఆదేశాలివ్వండి

వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు ఈ నెల 5వ తేదీలోగా పింఛన్ల పంపిణీ పూర్తి చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని తెదేపా, జనసేన, భాజపా నేతలు కోరారు.

Published : 02 Apr 2024 03:43 IST

సీఈవోకు తెదేపా, జనసేన, భాజపా నేతల ఫిర్యాదు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు ఈ నెల 5వ తేదీలోగా పింఛన్ల పంపిణీ పూర్తి చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని తెదేపా, జనసేన, భాజపా నేతలు కోరారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే పింఛన్లు రావని సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్న వైకాపా శ్రేణులను అరెస్టు చేసి.. కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పల్నాడు, నంద్యాల ఎస్పీలు, తిరుపతి కలెక్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌ కుమార్‌ మీనాకు.. మాజీ మంత్రులు నక్కా ఆనంద్‌బాబు, దేవినేని ఉమామహేశ్వరరావు, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, జనసేన రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు, భాజపా మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్‌ బాజి ఫిర్యాదు చేశారు. అనంతరం వర్ల రామయ్య విలేకరులతో మాట్లాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని