వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది.. వైకాపా కోసం పని చేయొచ్చేమో?

వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులను వైకాపా ప్రభుత్వ హయాంలో నియమించినందునా.. వారు అభిమానంతో మా కోసం పని చేయొచ్చేమోనని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.

Published : 02 Apr 2024 03:47 IST

మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు

విశాఖపట్నం(పెదవాల్తేరు), న్యూస్‌టుడే: వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులను వైకాపా ప్రభుత్వ హయాంలో నియమించినందునా.. వారు అభిమానంతో మా కోసం పని చేయొచ్చేమోనని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. విశాఖ బీచ్‌రోడ్డు వైకాపా కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ప్రస్తుత ఎన్నికల సమయంలో సస్పెండ్‌ అయినా, రాజీనామాలు చేసినా తరువాత వారిని మానవతా దృక్పథంతో విధుల్లోకి తీసుకునే అవకాశం ఉందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు