కళాశాలల్లో ప్రవేశాల పేరుతో వైకాపాకు ప్రచారం

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ప్రవేశాల పెంపు నెపంతో ఇంటర్‌ బోర్డు అధికారులు వైకాపా ప్రచారానికి తెరలేపారని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ ఆరోపించారు.

Published : 02 Apr 2024 03:49 IST

సీఈసీకి కనకమేడల ఫిర్యాదు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ప్రవేశాల పెంపు నెపంతో ఇంటర్‌ బోర్డు అధికారులు వైకాపా ప్రచారానికి తెరలేపారని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ ఆరోపించారు. ఆ బోర్డు రూపొందించిన ఇంటింటి ప్రచారాన్ని అడ్డుకోవాలని కోరుతూ కేంద్ర ఎన్నికల కమిషనర్‌(సీఈసీ)కు సోమవారం ఆయన ఫిర్యాదు చేశారు. ‘‘విద్యార్థుల పేరుతో వైకాపాకు ఎన్నికల ప్రచారం చేయాలనే ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. దీని ద్వారా అమ్మఒడి, జగనన్న గోరుముద్ద లాంటి పథకాల గురించి విద్యార్థుల కుటుంబ సభ్యులకు తెలియజేయాలని నిర్ణయించారు. సుమారు 6.3 లక్షల మంది విద్యార్థుల కుటుంబాల్ని ప్రభావితం చేయాలనేదే అధికార పార్టీ లక్ష్యంగా కనిపిస్తోంది. రాజకీయ ప్రేరేపితమైన ఇలాంటి కార్యక్రమాలు రూపకల్పన చేసిన అధికారులపై చర్యలు తీసుకోండి’’ అని రవీంద్రకుమార్‌ కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని