‘వాలంటీర్లను వేరే ప్రాంతాలకు బదిలీ చేయండి’

అధికార పార్టీకి అనుకూలంగా వాలంటీర్లు.. స్థానిక ప్రజలను ప్రలోభాలకు గురిచేసే అవకాశమున్నందున వారిని వేరే ప్రాంతాలకు బదిలీ చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈఓ) ముకేశ్‌కుమార్‌ మీనాని కోరినట్లు జై భారత్‌ నేషనల్‌ పార్టీ, లిబరేషన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు మాజీ జేడీ లక్ష్మీనారాయణ, ఎస్‌ఆర్‌కేఆర్‌ విజయ్‌కుమార్‌ వెల్లడించారు.

Published : 02 Apr 2024 03:50 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: అధికార పార్టీకి అనుకూలంగా వాలంటీర్లు.. స్థానిక ప్రజలను ప్రలోభాలకు గురిచేసే అవకాశమున్నందున వారిని వేరే ప్రాంతాలకు బదిలీ చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈఓ) ముకేశ్‌కుమార్‌ మీనాని కోరినట్లు జై భారత్‌ నేషనల్‌ పార్టీ, లిబరేషన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు మాజీ జేడీ లక్ష్మీనారాయణ, ఎస్‌ఆర్‌కేఆర్‌ విజయ్‌కుమార్‌ వెల్లడించారు. ఈ మేరకు సచివాలయంలో సీఈఓకి ఫిర్యాదు చేసిన పలు అంశాలను వారు మీడియాకు వెల్లడించారు. ‘తొలగించబడిన వాలంటీర్లు ప్రస్తుతం బాహాటంగానే వైకాపాకు ప్రచారం చేస్తున్నారు. వారితో సహా మెప్మా సిబ్బందిని సైతం బదిలీ చేయాలని కోరాం’ అని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని