ఎంపీ టికెట్ల కేటాయింపులో బీసీలను విస్మరించారు

లోక్‌సభ ఎన్నికల టికెట్ల కేటాయింపులో రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు బీసీలను విస్మరించాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ ఆరోపించారు.

Updated : 02 Apr 2024 04:51 IST

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌

రాంనగర్‌, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల టికెట్ల కేటాయింపులో రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు బీసీలను విస్మరించాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ ఆరోపించారు. సోమవారం హైదరాబాద్‌ దోమలగూడలోని సంఘం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మొత్తం 17 ఎంపీ స్థానాల్లో బీసీలకు 6 టికెట్లను భారాస కేటాయించగా.. భాజపా 5 సీట్లు ఇచ్చిందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ 13 చోట్ల అభ్యర్థులను ప్రకటిస్తే.. కేవలం మూడు టికెట్లే బీసీలకు లభించాయన్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా బీసీల రాజకీయ భవిష్యత్తుపై చర్చించి కార్యాచరణ రూపొందించడానికి ఈ నెల 7న బీసీ ప్రతినిధులతో కలిసి హైదరాబాద్‌లో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని