బాబుకే ఓటు వేస్తామంటున్నారు: మంత్రి ధర్మాన

త్వరలో యుద్ధానికి సిద్ధమవుతున్నాం.. ఇప్పటికీ చాలా మందికి మన పార్టీ గుర్తు తెలియదు అని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు.

Published : 02 Apr 2024 04:02 IST

మన గుర్తు చాలా మందికి తెలియదు

అరసవల్లి, కలెక్టరేట్‌(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: త్వరలో యుద్ధానికి సిద్ధమవుతున్నాం.. ఇప్పటికీ చాలా మందికి మన పార్టీ గుర్తు తెలియదు అని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం నగర పరిధి బలగ, శ్రీకాకుళం గ్రామీణ మండలం తండేంవలస పంచాయతీ బెండివానిపేటలో సోమవారం వైకాపా శ్రీకాకుళం లోక్‌సభ స్థానం అభ్యర్థి పేరాడ తిలక్‌తో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ‘ప్రచారానికి వెళ్లినప్పుడు ఏ పార్టీకి ఓటేస్తారని అడిగితే చాలామంది బాబుకే వేస్తామంటూ సమాధానమిస్తున్నారు. ఏ బాబుకు అని మరలా అడిగితే హస్తం అని, సైకిల్‌ అని రకరకాల పేర్లు చెబుతున్నారు. అధికారంలోకి రాగానే విశాఖను రాజధాని చేస్తాం’ అని ధర్మాన వ్యాఖ్యానించారు. మరోవైపు మంగువారితోటకు చెందిన సచివాలయ వాలంటీరు వి.మౌనిక మంత్రి ధర్మానకు మద్దతుగా సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టడం, బలగలో జరిగిన సమావేశానికి ఓ రౌడీషీటర్‌ హాజరుకావడం చర్చకు దారితీశాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని