మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్‌ జూన్‌ 2కు వాయిదా

మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపును కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయం సోమవారం ప్రకటన విడుదల చేసింది.

Updated : 02 Apr 2024 06:06 IST

ఈనాడు, హైదరాబాద్‌: మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపును కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయం సోమవారం ప్రకటన విడుదల చేసింది. జూన్‌ 2న కౌంటింగ్‌ చేపట్టాలని అధికారులను ఆదేశించింది. ఈ స్థానానికి మార్చి 28న పోలింగ్‌ జరిగింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఓట్ల లెక్కింపు మంగళవారం జరగాల్సి ఉంది. వచ్చే నెల 13న లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలు ప్రకటించింది. ఆ ఎన్నికల కౌంటింగ్‌ జూన్‌ 4న చేపట్టనుంది. దానికి రెండు రోజుల ముందు మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయం ఆ ప్రకటనలో పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని