వైకాపాకు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి రాజీనామా

ఎమ్మెల్సీ, వైకాపా బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి పార్టీ వీడారు. రాజీనామా పత్రాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డికి పంపారు. ఆదివారం రాత్రి బాపట్లలో తెదేపా అధినేత చంద్రబాబునాయుడిని ఆయన కలిశారు.

Published : 02 Apr 2024 03:56 IST

త్వరలో లోకేశ్‌ సమక్షంలో తెదేపాలో చేరుతానని ప్రకటన

గురజాల, న్యూస్‌టుడే: ఎమ్మెల్సీ, వైకాపా బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి పార్టీ వీడారు. రాజీనామా పత్రాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డికి పంపారు. ఆదివారం రాత్రి బాపట్లలో తెదేపా అధినేత చంద్రబాబునాయుడిని ఆయన కలిశారు. అనంతరం తన స్వగ్రామం పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడుకు చేరుకుని సోమవారం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలో లోకేశ్‌ సమక్షంలో తెదేపాలో చేరుతానని వెల్లడించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఎంతో కాలం తనతో నడిచిన నాయకులు, కార్యకర్తల ఆత్మగౌరవం కోసమే తాను వైకాపాకు రాజీనామా చేసినట్లు ప్రకటించారు. 1985 నుంచి 1996 వరకు తెదేపాలో పనిచేశానని, తర్వాత కాంగ్రెస్‌లో చేరానని, 2014 నుంచి వైకాపా కోసం పనిచేశానని పేర్కొన్నారు. నియోజకవర్గ పరిధిలో వైకాపాలో వస్తున్న మార్పులతో తన వర్గీయులకు ఏర్పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రాజీనామా చేసినట్లు తెలిపారు. వ్యక్తిగత పదవుల కోసం ఈ నిర్ణయం తీసుకోలేదన్నారు. రాజకీయాలు వ్యాపారంగా మారాయని వాపోయారు. తాను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి అంకితభావంతో పనిచేశానని తెలిపారు. తొలినుంచి వైకాపా జెండా మోసిన వారి పరిస్థితి అగమ్యంగా మారిందని వాపోయారు. వారి ఇబ్బందులను ప్రభుత్వం, పార్టీ అధిష్ఠానానికి తెలిపినా ప్రయోజనం లేదని వివరించారు. పార్టీ నాయకులు, అభిమానుల సూచన మేరకే రాజీనామా చేశానన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని