ఫోన్‌ ట్యాపింగ్‌ కేసును పారదర్శకంగా విచారించండి

ఫోన్‌ ట్యాపింగ్‌పై మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌ఛార్జి, న్యాయవాది కేకే మహేందర్‌రెడ్డి సోమవారం హైదరాబాద్‌లోని సీసీఎస్‌లో నగర పోలీసు కమిషనర్‌ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు.

Published : 02 Apr 2024 04:06 IST

హైదరాబాద్‌ సీపీకి కాంగ్రెస్‌ నేతల వినతి

నారాయణగూడ, న్యూస్‌టుడే: ఫోన్‌ ట్యాపింగ్‌పై మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌ఛార్జి, న్యాయవాది కేకే మహేందర్‌రెడ్డి సోమవారం హైదరాబాద్‌లోని సీసీఎస్‌లో నగర పోలీసు కమిషనర్‌ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. సిరిసిల్ల కేంద్రంగా ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందని పేర్కొంటూ దానికి సంబంధించిన కీలక సమాచారాన్ని కమిషనర్‌కు అందజేశారు. అనంతరం కేకే మహేందర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావుల ఆధ్వర్యంలో గత భారాస ప్రభుత్వం ప్రజల వ్యక్తిగత జీవితానికి, స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడిందని ఆరోపించారు.  ఫోన్‌ ట్యాపింగ్‌ చేయాలని ఆదేశాలు జారీ చేసిన గత ప్రభుత్వంలోని పెద్దలను కూడా వదిలిపెట్టకుండా పారదర్శకంగా విచారణ జరిపించాలని కోరుతూ సీపీకి వినతిపత్రం సమర్పించామని చెప్పారు. ప్రణీత్‌రావు సిరిసిల్లలో అరెస్టు అయ్యాడు కాబట్టి కచ్చితంగా తన ఫోన్‌ కూడా ట్యాపింగ్‌ అయినట్లు తేటతెల్లమవుతోందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని