మంత్రి పదవి, రూ.25 కోట్ల నగదు

ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) నుంచి బయటకు వచ్చేయడంతోపాటు 10 మంది ఎమ్మెల్యేలను తీసుకురావాలని, అలా చేస్తే రూ.25 కోట్ల నగదు ఇస్తామంటూ భాజపా తనను సంప్రదించిందని ఆప్‌ ఎమ్మెల్యే రితురాజ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Published : 02 Apr 2024 04:42 IST

 భాజపాలో చేరితే నాకు ఇస్తామన్నారు
ఆప్‌ ఎమ్మెల్యే రితురాజ్‌  వ్యాఖ్యలు
10 మంది ఎమ్మెల్యేలను కూడా తీసుకురమ్మన్నారని వెల్లడి

దిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) నుంచి బయటకు వచ్చేయడంతోపాటు 10 మంది ఎమ్మెల్యేలను తీసుకురావాలని, అలా చేస్తే రూ.25 కోట్ల నగదు ఇస్తామంటూ భాజపా తనను సంప్రదించిందని ఆప్‌ ఎమ్మెల్యే రితురాజ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన దిల్లీ అసెంబ్లీలో మాట్లాడారు. ‘‘మూడు నాలుగు రోజుల నుంచి కొందరు వ్యక్తులు నన్ను ఫోన్లో సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నారు. ఆదివారం ఇక్కడ ఇండియా కూటమి మహార్యాలీ తర్వాత వివాహ వేడుకకు హాజరుకావడానికి దరియాపుర్‌ వెళ్లాను. అక్కడ నలుగురు వ్యక్తులు నన్ను పక్కకు తీసుకెళ్లారు. మేం చెప్పిన దానికి అంగీకరించకపోతే మీకు ఏమీ రాదు. రాష్ట్రపతి పాలన విధిస్తారు. అదే 10 మంది శాసనసభ్యులను తీసుకువస్తే ఒక్కొక్కరికి రూ.25 కోట్ల చొప్పున ఇవ్వడంతోపాటు భాజపా ప్రభుత్వంలో మిమ్మల్ని మంత్రిని చేస్తామని వారు చెప్పారు’’ అని పేర్కొన్నారు. ‘‘మా ప్రభుత్వాన్ని అణచివేయాలని భాజపా అనుకుంటోంది. 2013, 2015, 2020 అసెంబ్లీ, 2022 స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీని ఓడించిన ఏకైక నాయకుడు కేజ్రీవాల్‌ మాత్రమే. దాంతో వారు మళ్లీ కుట్ర పన్నుతున్నారు. ఆప్‌ ఎమ్మెల్యేలు పార్టీని వీడరు’’ అని రితురాజ్‌ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని