భాజపా ఎన్నికల ప్రణాళికలో బీసీ డిమాండ్లు చేర్చాలి

భారతీయ జనతా పార్టీ జాతీయ ఎన్నికల ప్రణాళికలో బీసీల డిమాండ్లను చేర్చాలని జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య కోరారు.

Published : 02 Apr 2024 04:43 IST

ప్రధాని మోదీకి ఆర్‌.కృష్ణయ్య లేఖ 

ఈనాడు,హైదరాబాద్‌: భారతీయ జనతా పార్టీ జాతీయ ఎన్నికల ప్రణాళికలో బీసీల డిమాండ్లను చేర్చాలని జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య కోరారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సోమవారం ఆయన లేఖ రాశారు. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన బీసీ బిల్లు, కేంద్రంలో ఓబీసీలకు ప్రత్యేకమంత్రిత్వ శాఖ, బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు, ప్రైవేటు సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు, న్యాయ వ్యవస్థలో బీసీ రిజర్వేషన్లు, విద్యార్థులకు వందశాతం బోధన రుసుములు, ఉపకార వేతనాలు, స్థానిక సంస్థల్లో జనాభా దామాషాలో రిజర్వేషన్లు, సంపన్నశ్రేణి నిబంధన ఎత్తివేత, సామాజిక భద్రత పథకాలు బీసీలకు వర్తింపు, జాతీయ స్థాయిలో బడ్జెట్‌లో బీసీ ఉప ప్రణాళిక, జాతీయ బీసీ కార్పొరేషన్‌ బలోపేతం వంటి అంశాలను ఎన్నికల ప్రణాళికలో చేర్చాలని ఆయన కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని