రాజధానిపై అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటా

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని విషయంలో కాంగ్రెస్‌ అధిష్ఠానం తీసుకొనే నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్‌ ప్రకటించారు.

Published : 02 Apr 2024 05:33 IST

కాంగ్రెస్‌ నేత, తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్‌

ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని విషయంలో కాంగ్రెస్‌ అధిష్ఠానం తీసుకొనే నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్‌ ప్రకటించారు. కాంగ్రెస్‌ పార్టీ రాజధానిగా అమరావతికి మద్దతిస్తూ వస్తున్న తరుణంలో ఆయన ఇటీవల విలేకర్లతో మాట్లాడుతూ.. తిరుపతిని రాజధానిగా చేయాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల సమయంలో ఇది వివాదానికి దారితీసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయన సోమవారం ఏఐసీసీ కార్యాలయం వద్ద పార్టీ జాతీయ కార్యదర్శి మెయప్పన్‌ సమక్షంలో స్పష్టత ఇచ్చారు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా, దానికే కట్టుబడి ఉంటానని చెప్పారు. ఈ అంశంపై వివరణ ఇవ్వాలని హైకమాండ్‌ ఏమైనా కోరిందా అన్న ప్రశ్నకు బదులిస్తూ.. అదేమీ లేదని, తనంతట తానే చెప్పాలనుకొని దీనిపై స్పష్టత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. పార్టీ కార్యదర్శి మెయప్పన్‌ మాట్లాడుతూ ఈ ప్రకటన ఇవ్వాలని ఒత్తిడేమీ లేదని, ఆయనే స్వచ్ఛందంగా ఇస్తున్నారని చెప్పారు. ఏది రాజధానిగా ఉండాలన్న దానిపై కాంగ్రెస్‌ నాయకత్వం విధాన ప్రకటన చేస్తుందని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని