అనంత్‌నాగ్‌-రాజౌరి లోక్‌సభ స్థానం నుంచి ఆజాద్‌ పోటీ!

జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి గులాంనబీ ఆజాద్‌.. అనంత్‌నాగ్‌-రాజౌరి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయనున్నారు.

Published : 03 Apr 2024 03:34 IST

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి గులాంనబీ ఆజాద్‌.. అనంత్‌నాగ్‌-రాజౌరి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. ఆయన సొంత పార్టీ డీపీఏపీకి చెందిన కోర్‌ కమిటీ మంగళవారం సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఆజాద్‌.. 2022లో కాంగ్రెస్‌ వీడి, సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. 2014లో ఆయన ఉధంపుర్‌ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత మళ్లీ లోక్‌సభకు పోటీ చేయలేదు. 1980, 1984లో ఆయన మహారాష్ట్ర నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు