రైతుల బాధ ఇప్పుడు గుర్తుకొచ్చిందా?

ఐదేళ్లు కరీంనగర్‌ ఎంపీగా ఉన్నప్పుడు ప్రజల సమస్యలు పట్టించుకోని బండి సంజయ్‌కి ఇప్పుడు రైతుల బాధ గుర్తుకొచ్చిందా? అని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రశ్నించారు. ఇక్కడ దీక్షలు చేసే బదులు దిల్లీ వెళ్లి ప్రధాని మోదీ ముందు చేయాలని మాజీ సీఎం కేసీఆర్‌, బండి సంజయ్‌లకు సూచించారు.

Updated : 03 Apr 2024 04:49 IST

బండి సంజయ్‌ని ప్రశ్నించిన పొన్నం

హుస్నాబాద్‌, న్యూస్‌టుడే: ఐదేళ్లు కరీంనగర్‌ ఎంపీగా ఉన్నప్పుడు ప్రజల సమస్యలు పట్టించుకోని బండి సంజయ్‌కి ఇప్పుడు రైతుల బాధ గుర్తుకొచ్చిందా? అని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రశ్నించారు. ఇక్కడ దీక్షలు చేసే బదులు దిల్లీ వెళ్లి ప్రధాని మోదీ ముందు చేయాలని మాజీ సీఎం కేసీఆర్‌, బండి సంజయ్‌లకు సూచించారు. మంగళవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో సర్దార్‌ సర్వాయి పాపన్న వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. ఓట్ల కోసం మొన్నటి వరకు శ్రీరాముడి ఫొటో పెట్టుకున్నారని, ఇప్పుడు రైతుల దగ్గర మొసలి కన్నీరు కారుస్తున్నారని భాజపా నేతలను ఉద్దేశించి విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్‌ సహా భారాస నాయకులు రైతులను రాజకీయాల కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. వర్షాలు లేక కరవు వస్తే.. కాంగ్రెస్‌ వల్ల వచ్చిందని కొందరు  మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో ప్రధాని సహకారం కోరతామని, అందుకు కాంగ్రెస్‌తో కలిసిరావాలని బండి సంజయ్‌కు సూచించారు. కార్యక్రమంలో సహకార సంఘం ఛైర్మన్‌ శివయ్య, పీసీసీ సభ్యుడు లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని