గెలిస్తే సేవకుడిని.. ఓడిపోతే స్నేహితుడిని

ఎన్నికల్లో గెలిస్తే సేవకుడిగా.. ఓడిపోతే స్నేహితుడిగా ఉంటానని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Updated : 03 Apr 2024 05:57 IST

రజక సామాజికవర్గ సమావేశంలో మంత్రి ధర్మాన

అరసవల్లి, న్యూస్‌టుడే: ఎన్నికల్లో గెలిస్తే సేవకుడిగా.. ఓడిపోతే స్నేహితుడిగా ఉంటానని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళం నగరంలోని ఓ హోటల్‌లో మంగళవారం నిర్వహించిన రజక సామాజికవర్గ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వాలంటీర్లు పింఛన్లు పంపిణీ చేయకుండా తెదేపా నాయకులు అడ్డుకున్నారని ధ్వజమెత్తారు.

‘ఎమ్మెల్యేగా పోటీ చేయనని ముఖ్యమంత్రి జగన్‌తో చెప్పా. ఈసారికి పోటీ చేయాలని ఆయన సూచించడంతో శ్రీకాకుళం నుంచి బరిలోకి దిగాను’ అని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. మంగళవారం రాత్రి తూర్పుకాపు సంక్షేమ సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ఉపాధ్యాయులు ప్రభుత్వంపై కోపం తగ్గించుకోండి. ఏమైనా ఇబ్బందులుంటే చెప్పండి’ అని ధర్మాన పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని