పవన్‌కల్యాణ్‌తో సుజనాచౌదరి, కామినేని భేటీ

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ను భాజపా నాయకులు సుజనాచౌదరి, కామినేని శ్రీనివాస్‌ మంగళవారం కలిశారు.

Updated : 03 Apr 2024 06:43 IST

ఈనాడు, అమరావతి: కొత్తపల్లి, న్యూస్‌టుడే: జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ను భాజపా నాయకులు సుజనాచౌదరి, కామినేని శ్రీనివాస్‌ మంగళవారం కలిశారు. పిఠాపురంలోని పవన్‌ బస చేసిన గోకులం గ్రాండ్‌లో ఈ భేటీ జరిగింది. పవన్‌ కల్యాణ్‌ సోదరుడు నాగబాబు కూడా పాల్గొన్నారు. భేటీ అనంతరం సుజనాచౌదరి, కామినేని శ్రీనివాస్‌ మీడియాతో మాట్లాడారు.

పొత్తు ధర్మంలో అన్న సీటునే త్యాగం చేశారు

‘పొత్తు ధ]ర్మంలో భాగంగా తన అన్న నాగేంద్రబాబు ఎంపీ టికెట్‌నే త్యాగం చేసిన గొప్ప వ్యక్తి పవన్‌కల్యాణ్‌. అన్నను తప్పుకోమని అనకాపల్లి లోక్‌సభ స్థానాన్ని భాజపాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పాం. కూటమిని ఎలా గెలిపించుకోవాలనే అంశంపై చర్చించాం. నేను విజయవాడ పశ్చిమ నుంచి పోటీ చేస్తున్నా. స్థానికంగా ఉన్న సమస్యలు, వివిధ అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లాం. అక్కడున్న పోతిన మహేష్‌తో మాట్లాడి ఏ సమస్యా లేకుండా చూస్తామన్నారు. నేను   పోటీ చేసే నియోజకవర్గానికి వచ్చి ప్రచారం చేస్తానని హామీ ఇచ్చారు’ అని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ భాజపా అభ్యర్థి సుజనా చౌదరి చెప్పారు. ‘రాష్ట్ర శ్రేయస్సు కోసం ఏర్పాటైన తెదేపా, జనసేన, భాజపా కూటమిలో పవన్‌కల్యాణ్‌ ముఖ్య భూమిక పోషించారు. ఆయనను మా నియోజకవర్గంలో పర్యటించాలని కోరాం. ప్రచారం చేస్తానని హామీ ఇచ్చారు. పిఠాపురం ప్రజలు పవన్‌కు బ్రహ్మరథం పడుతున్నారు’ అని కైకలూరు భాజపా అభ్యర్థి కామినేని శ్రీనివాసరావు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని