తెదేపాలోకి వైకాపా ఎమ్మెల్యే సోదరుడు

నంద్యాల జిల్లా పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి సోదరుడు కాటసాని చంద్రశేఖరరెడ్డి తెదేపా తీర్థం పుచ్చుకున్నారు.

Published : 03 Apr 2024 07:47 IST

చంద్రబాబు సమక్షంలో పార్టీలోకి కాటసాని చంద్రశేఖరరెడ్డి

బనగానపల్లి, న్యూస్‌టుడే: నంద్యాల జిల్లా పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి సోదరుడు కాటసాని చంద్రశేఖరరెడ్డి తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో బనగానపల్లి తెదేపా అభ్యర్థి బీసీ జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆయన పార్టీలో చేరారు. చంద్రబాబు పార్టీ కండువా కప్పి చంద్రశేఖరరెడ్డిని తెదేపాలోకి ఆహ్వానించారు. జనార్దన్‌రెడ్డి, నంద్యాల ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి గెలుపునకు కృషి చేయాలని, భారీ మెజారిటీతో గెలిపించాలని పార్టీ అధినేత ఆయనకు సూచించారు. అనంతరం చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ 1994లో తెదేపా నుంచి తన అన్న కాటసాని రాంభూపాల్‌రెడ్డిపై (కాంగ్రెస్‌) పోటీ చేశానని, తిరిగి సొంతగూటికి చేరినందుకు సంతోషంగా ఉందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు