‘బూడి’ కోడ్‌ ఉల్లంఘనపై కుమారుడి ఆగ్రహం

ఎన్నికల నియమావళికి విరుద్ధంగా తండ్రి బూడి ముత్యాలనాయుడు చేస్తున్న పనులను ఆయన కుమారుడే ప్రశ్నించారు.

Updated : 03 Apr 2024 07:57 IST

ప్రభుత్వ భవనాల్లోని ముత్యాలనాయుడి క్యాంపు కార్యాలయం
ఖాళీ చేయించనందుకు అధికారులను ప్రశ్నించిన రవికుమార్‌

 ఈనాడు, అనకాపల్లి: ఎన్నికల నియమావళికి విరుద్ధంగా తండ్రి బూడి ముత్యాలనాయుడు చేస్తున్న పనులను ఆయన కుమారుడే ప్రశ్నించారు. దీంతో విధిలేక అధికారులు చర్యలకు ఉపక్రమించారు. అనకాపల్లి జిల్లా తారువ గ్రామంలో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు ప్రభుత్వ భవనాలని క్యాంపు కార్యాలయంగా ఉపయోగిస్తున్నారు. ఇది తెలిసి బూడి కుమారుడు రవికుమార్‌.. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా ప్రభుత్వ భవనాన్ని ఎలా వినియోగిస్తారని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలోనూ అధికారులు అధికార పార్టీ నేతలకు కొమ్ముకాస్తున్నారంటూ ఆరోపించారు. ‘ఆ భవనాలేవీ మా తండ్రి స్వార్జితం కావు. తెదేపా హయాంలో పంచాయతీ, గ్రంథాలయం కోసం నిర్మించినవి. వాటిని క్యాంపు కార్యాలయంగా వాడుతున్నారు. ఎన్నికల కోడ్‌ వచ్చాక ఆ భవనాలను వినియోగించడం తప్పు’ అని రవికుమార్‌ మంగళవారం తారువలో మీడియాకు వెల్లడించారు.రవికుమార్‌ ఆరోపణలు చేసిన కొన్ని గంటల తర్వాత స్థానిక అధికారులు క్యాంపు కార్యాలయానికి చేరుకుని అందులోని సామగ్రిని బయటపెట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని