7న ఆప్‌ శ్రేణుల సామూహిక నిరాహార దీక్షలు

కేజ్రీవాల్‌ అరెస్టుకు నిరసనగా ఈ నెల 7న దిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతలు నిరాహార దీక్షకు దిగనున్నారు.

Published : 04 Apr 2024 04:03 IST

దిల్లీ: కేజ్రీవాల్‌ అరెస్టుకు నిరసనగా ఈ నెల 7న దిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతలు నిరాహార దీక్షకు దిగనున్నారు. ఈ విషయాన్ని ఆప్‌ నేత గోపాల్‌ రాయ్‌ బుధవారం వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఆప్‌ శ్రేణులు సామూహిక నిరాహార దీక్షలు చేపడతాయని తెలిపారు.

ఆతిశీపై భాజపా పరువు నష్టం దావా

అత్యంత సన్నిహితుల ద్వారా భాజపాలో చేరడానికి తనకు ఆహ్వానమందిందంటూ దిల్లీ మంత్రి ఆతిశీ చేసిన వ్యాఖ్యలపై భాజపా తీవ్రంగా స్పందించింది. ఆమెకు పరువునష్టం దావా నోటీసులను పంపినట్లు బుధవారం భాజపా దిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ్‌ ప్రకటించారు. వాటికి 15 రోజుల్లోగా సమాధానం చెప్పాలని, చేసిన ఆరోపణలకు ఆధారాలను చూపాలని కోరారు. లేదంటే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండు చేశారు.

ఆతిశీజీ.. మా దగ్గర ఖాళీల్లేవ్‌: కేంద్రమంత్రి

ఆతిశీ ఆరోపణలకు కేంద్రమంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి కౌంటర్‌ ఇచ్చారు. ‘‘ఆమ్‌ ఆద్మీ పార్టీ మొత్తం మద్యం కేసులో ఇరుక్కొంది. ఈ తరుణంలో ఆమెను మా పార్టీలో చేర్చుకొని ఇబ్బందులు సృష్టించుకోం. ఇక ఆతిశీ వంటి రాజకీయ కార్యకర్తకు మా పార్టీలో చోటులేదు’’ అని ఆతిశీ ఆరోపణలను తిప్పికొట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని