తక్షణమే రూ.2 లక్షల రుణమాఫీ చేయాలి

బ్యాంకుల నుంచి నోటీసులు, ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న రైతులకు తక్షణమే రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని భారాస సీనియర్‌ నేత, మాజీ మంత్రి టి.హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు.

Published : 04 Apr 2024 04:04 IST

సీఎం రేవంత్‌కు హరీశ్‌రావు లేఖ

ఈనాడు, హైదరాబాద్‌: బ్యాంకుల నుంచి నోటీసులు, ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న రైతులకు తక్షణమే రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని భారాస సీనియర్‌ నేత, మాజీ మంత్రి టి.హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. రైతు రుణమాఫీపై బుధవారం ఆయన సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. ‘‘తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే.. డిసెంబర్‌ 9 నాడే రూ.2 లక్షల రుణమాఫీ ఒకేసారి చేస్తామని మీరు శాసనసభ ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపరిచారు. మీ మాటను నమ్మి రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులు బ్యాంకుల నుంచి పంట రుణాలు తీసుకున్నారు. కానీ మీరు అధికారంలోకి వచ్చి దాదాపు 4 నెలలు గడుస్తున్నా.. ఇప్పటికీ ఒక్క రైతుకు కూడా ఒక్క రూపాయి రుణ మాఫీ కాలేదు. మరోవైపు బ్యాంకులు రైతులపై ఒత్తిడి చేస్తున్నాయి’’ అని హరీశ్‌రావు లేఖలో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని