ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తా

సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తానన్న సంపూర్ణ విశ్వాసం తనకు ఉందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు.

Updated : 04 Apr 2024 07:20 IST

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తానన్న సంపూర్ణ విశ్వాసం తనకు ఉందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. హైదరాబాద్‌ నుంచి బుధవారం సాయంత్రం ఆయన విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నారు. ‘ఏ పార్టీయో తెలియదు. ఎమ్మెల్యేగానో, ఎంపీగానో తెలియదు. మూడు, నాలుగు రోజుల్లో మంచి వార్త వస్తుందని అనుకుంటున్నా. అమ్మవారిని దర్శించుకోవడానికి విజయవాడ వచ్చాను’ అని ఆయన పేర్కొన్నారు. రఘురామకు తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూల్పూరి సాయికల్యాణి, పలువురు నాయకులు స్వాగతం పలికారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని