కరణం ధర్మశ్రీకి వైకాపా నాయకుల ఝలక్‌

అనకాపల్లి జిల్లా బుచ్చెయ్యపేట మండల వైకాపా నాయకులు.. విప్‌ కరణం ధర్మశ్రీకి షాకిచ్చారు. చోడవరం నియోజకవర్గంలో ఇన్నాళ్లు ధర్మశ్రీకి వెన్నంటి ఉన్న నాయకులు, కార్యకర్తలు సుమారు 2 వేల మంది తెదేపాలో చేరారు.

Updated : 04 Apr 2024 09:39 IST

2 వేల మంది తెదేపాలో చేరిక

చోడవరం, న్యూస్‌టుడే: అనకాపల్లి జిల్లా బుచ్చెయ్యపేట మండల వైకాపా నాయకులు.. విప్‌ కరణం ధర్మశ్రీకి షాకిచ్చారు. చోడవరం నియోజకవర్గంలో ఇన్నాళ్లు ధర్మశ్రీకి వెన్నంటి ఉన్న నాయకులు, కార్యకర్తలు సుమారు 2 వేల మంది తెదేపాలో చేరారు. ఒకేసారి అంతమంది ర్యాలీగా చోడవరంలోని తెదేపా కార్యాలయానికి చేరడంతో పట్టణంలో జనసందోహం కనిపించింది. తెదేపాలో చేరిన వారిలో విశాఖ డెయిరీ డైరెక్టర్‌ గేదెల సత్యనారాయణ, సర్పంచులు గేదెల వెంకయ్యమ్మ (కోమళ్లపూడి), గౌరమ్మ (గంటికొర్లాం), వేపాడ మనీషా (ఎల్‌.శింగవరం), నైదాన రాజు (గొర్లెపాలెం), ఎంపీటీసీ సభ్యులు దేవర అప్పారావు (కె.పి.అగ్రహారం), ఒడుగొండు దేవి  (పొట్టి దొరపాలెం), పాతాళ శ్రీను (బుచ్చెయ్యపేట), నీలకంఠపురం, ఆర్‌.బీమవరం, ఆర్‌.శివరామపురం, పెదమదీనా పాల సంఘాల అధ్యక్షులు, మాజీ సర్పంచులు, విద్యా కమిటీ ఛైర్మన్లు, గ్రామ నాయకులు ఉన్నారు. వీరందరికీ కూటమి అభ్యర్థి కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు, తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షుడు గూనూరు మల్లు నాయుడు సమక్షంలో బుచ్చెయ్యపేట మండల తెదేపా అధ్యక్షుడు గోకివాడ కోటేశ్వరరావు కండువాలు కప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని