జైలా.. బెయిలా.. తేల్చుకోండి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అన్ని నియోజకవర్గాల్లోనూ గత రికార్డులను తిరగరాసేలా గెలవాలని భాజపా కార్యకర్తలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.

Published : 04 Apr 2024 04:19 IST

అవినీతిపరులకు ఉన్న అవకాశాలు ఆ రెండే: మోదీ

లఖ్‌నవూ, కోల్‌కతా: ఉత్తర్‌ప్రదేశ్‌లోని అన్ని నియోజకవర్గాల్లోనూ గత రికార్డులను తిరగరాసేలా గెలవాలని భాజపా కార్యకర్తలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అవినీతిపై చర్యలు తీసుకుంటూనే ఉంటానని.. అలాంటి నేతలకు జైలు, లేదంటే బెయిల్‌ అనే రెండు అవకాశాలే మిగిలాయని చెప్పారు. బుధవారం ఆయన ఉత్తర్‌ప్రదేశ్‌లోని 10 లోక్‌సభ నియోజకవర్గాల బూత్‌ స్థాయి కార్యకర్తలతోనూ, బెంగాల్‌లోని పార్టీ కార్యకర్తలతోనూ నమో యాప్‌ ద్వారా మాట్లాడారు. ‘గెలుపునకు కీలకమైన ఆత్మ పోలింగ్‌ బూత్‌ స్థాయిలోనే ఉంటుంది. మీ కృషిపైనే ఎన్నికల్లో గెలుపు ఆధారపడి ఉంటుంది. ఓటర్లతో నేరుగా సంబంధాలుండేది మీకే. వారివద్ద భాజపా ముఖం మీరే. వారు మిమ్మల్ని కలిసినప్పుడు మోదీని చూస్తారు. మీరు ఏం చెబితే అది నేను చెప్పినట్లుగానే భావిస్తారు. ఓటర్ల దృష్టిలో మీరు బాధ్యతాయుతమైన వ్యక్తులు. తమ సమస్యలను మీరే పరిష్కరించగలరని వారు భావిస్తారు. పోలింగ్‌ బూత్‌ స్థాయిలో మనం విజయం సాధించకపోతే ఎన్నికల్లో గెలవలేం’ అని మోదీ పేర్కొన్నారు. అవినీతిపరులపై చర్యలు తీసుకోవడానికే కట్టుబడి ఉంటానని మోదీ వెల్లడించారు. ఈ సారి బెంగాల్‌లో మరిన్ని సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ‘తృణమూల్‌, కాంగ్రెస్‌-వామపక్ష కూటమి ఒకదానిపై ఒకటి పోటీ చేస్తున్నాయని అనుకోవడం ఉత్తి భ్రమ. ఆ పార్టీలన్నీ ఒక్కటే’ అని ప్రధాని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు