కార్మికుల సంక్షేమానికి భాజపా కృషి

సంఘటిత, అసంఘటిత కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తున్న మోదీ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో అండగా నిలవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి కోరారు.

Published : 04 Apr 2024 04:20 IST

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: సంఘటిత, అసంఘటిత కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తున్న మోదీ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో అండగా నిలవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి కోరారు. రాష్ట్రంలో గతంలో భారాస ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం అసంఘటిత రంగ కార్మికుల కనీస వేతన చట్టాన్ని అమలు చేయడంలేదన్నారు. కనీస వేతనాన్ని కేంద్రం రూ.18 వేలకు పెంచినా రాష్ట్రంలో ఇంకా రూ.12 వేలే కొనసాగుతోందన్నారు. భాజపా నేతలు బుధవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులతో సమావేశమయ్యారు. కిషన్‌రెడ్డితో పాటు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌, సెంట్రల్‌ బోర్డు ట్రస్టీస్‌ మెంబర్‌ సుంకరి మల్లేశ్‌, పీఎల్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భాజపా మ్యానిఫెస్టోలో కార్మికులకు సంబంధించి చేర్చాల్సిన అంశాలపై చర్చించారు. విశ్వకర్మ యోజన ద్వారా కార్మికులకు అండగా నిలుస్తోందన్నారు.

బీజేవైఎం రాష్ట్ర కమిటీ ఏర్పాటు

భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) రాష్ట్ర నూతన కమిటీని అధ్యక్షుడు ఎస్‌.మహేందర్‌ బుధవారం ప్రకటించారు.   ఎనిమిది మంది ఉపాధ్యక్షులు, ముగ్గురు ప్రధాన కార్యదర్శులు, ఎనిమిది మంది రాష్ట్ర కార్యదర్శులు సహా ఇతర విభాగాల బాధ్యులను ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని