భాజపా, భారాసల చీకటి ఒప్పందం

పార్లమెంటు ఎన్నికల కోసం భాజపా, భారాసలు చీకటి ఒప్పందం కుదుర్చుకున్నాయని మంత్రి కొండా సురేఖ అన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం చిట్కుల్‌లో కాంగ్రెస్‌ సమన్వయ సమావేశానికి ఆమె హాజరయ్యారు.

Published : 04 Apr 2024 04:32 IST

ట్యాపింగ్‌ వ్యవహారంలో త్వరలో మరిన్ని అరెస్టులు: మంత్రి కొండా సురేఖ

పటాన్‌చెరు, న్యూస్‌టుడే: పార్లమెంటు ఎన్నికల కోసం భాజపా, భారాసలు చీకటి ఒప్పందం కుదుర్చుకున్నాయని మంత్రి కొండా సురేఖ అన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం చిట్కుల్‌లో కాంగ్రెస్‌ సమన్వయ సమావేశానికి ఆమె హాజరయ్యారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఫోన్‌ట్యాపింగ్‌ వ్యవహారంలో త్వరలో మరిన్ని అరెస్టులు జరుగుతాయని చెప్పారు. రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతులను వదిలిపెట్టి ఇతర రాష్ట్రాలవారికి పరిహారం అందించిన వ్యవహారంపై ఆరా తీస్తున్నామన్నారు. అన్నిరకాల కేసులు ఉన్నందున భాజపాతో కలిసి పని చేయడానికి ఒప్పందాలు కుదుర్చుకున్న కేసీఆర్‌ కుటుంబాన్ని నమ్మి మళ్లీ మోసపోవద్దన్నారు. దుబ్బాకలో ఎమ్మెల్యేగా ఉండి ఎలాంటి అభివృద్ధి చేయని రఘునందన్‌రావుకు ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. దొంగలు దొంగలను చేర్చుకున్నారంటూ హరీశ్‌రావు విమర్శించడాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని పేర్కొన్నారు. భారాస హయాంలో మంత్రులుగా ఇతర పార్టీల వారు ఎంతమంది పనిచేశారో లెక్కలు వేసుకోవాలని సూచించారు. ఒక ఐఏఎస్‌ అధికారిగా ఉంటూ కేసీఆర్‌ కాళ్లు మొక్కిన వెంకట్రామిరెడ్డికి ఎంపీగా ఎలా అర్హత ఉంటుందో ప్రజలే నిర్ణయించాలన్నారు. కార్యక్రమంలో మెదక్‌ అభ్యర్థి నీలం మధు, టీఎస్‌ఐఐసీ ఛైర్మన్‌ నిర్మల, మహిళా విభాగం జిల్లాఅధ్యక్షురాలు సుధారాణి, నియోజకవర్గాల పార్టీ ఇన్‌ఛార్జులు హరికృష్ణ, శ్రీనివాస్‌రెడ్డి, నర్సారెడ్డి, రాజిరెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, ఆంజనేయులుగౌడ్‌ తదితరులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు