నాకెందుకు టికెట్‌ ఇవ్వలేదు?

బిహార్‌ రాజకీయాల్లో సుపరిచితుడైన మాజీ ఎంపీ పప్పూయాదవ్‌.. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెటు దక్కలేదని ఏడ్చేశారు.

Updated : 06 Apr 2024 06:15 IST

వేదికపై విలపించిన పప్పూయాదవ్‌

పట్నా: బిహార్‌ రాజకీయాల్లో సుపరిచితుడైన మాజీ ఎంపీ పప్పూయాదవ్‌.. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెటు దక్కలేదని ఏడ్చేశారు. పూర్ణియా నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషను వేశాక మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఇటీవలే తన జన్‌ అధికార్‌ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన పప్పూయాదవ్‌ పూర్ణియా టికెటు ఆశించారు. ఆర్జేడీ - కాంగ్రెస్‌ పొత్తులో భాగంగా లాలూప్రసాద్‌ యాదవ్‌ పార్టీ పూర్ణియా నుంచి బీమా భారతీని నిలబెట్టింది. ఈ నిర్ణయం పప్పూను తీవ్రంగా బాధించడంతో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషను వేశారు. అనంతరం మద్దతుదారులతో మాట్లాడుతూ ‘‘నాకేం తక్కువ’’ అంటూ కన్నీరు పెట్టుకున్నారు. బిహార్‌లోని 40 లోక్‌సభ స్థానాల్లో పొత్తులో భాగంగా కాంగ్రెస్‌కు 9 సీట్లు దక్కాయి. ఇప్పటికే అభ్యర్థులు ఖరారైనందున పప్పూ యాదవ్‌ తమ అభ్యర్థి కాదని, ఆర్జేడీ అభ్యర్థికే మద్దతు అని కాంగ్రెస్‌ పార్టీ స్పష్టం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని