అరుణాచల్‌లో అతివల ప్రాతినిధ్యం అరకొరే

ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్‌ప్రదేశ్‌లో ప్రజాప్రతినిధులుగా మహిళా ప్రాతినిధ్యం అంతంతమాత్రంగానే ఉంటోంది. సాంస్కృతిక కట్టుబాట్లు, సామాజిక-ఆర్థిక అడ్డంకులు, అవగాహన లేమి.. ఇలా కారణాలు ఏమైనా రాజకీయ రంగంలో అతివల పాత్ర తక్కువే.

Updated : 08 Apr 2024 06:14 IST

లోక్‌సభ బరిలో ఒకరు.. అసెంబ్లీకి 8 మంది పోటీ

ఈటానగర్‌: ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్‌ప్రదేశ్‌లో ప్రజాప్రతినిధులుగా మహిళా ప్రాతినిధ్యం అంతంతమాత్రంగానే ఉంటోంది. సాంస్కృతిక కట్టుబాట్లు, సామాజిక-ఆర్థిక అడ్డంకులు, అవగాహన లేమి.. ఇలా కారణాలు ఏమైనా రాజకీయ రంగంలో అతివల పాత్ర తక్కువే. ఈ రాష్ట్రంలో ఉన్న రెండు లోక్‌సభ స్థానాలు, 50 అసెంబ్లీ సీట్లకు ఈ నెల 19న ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి. తూర్పు, పశ్చిమ అరుణాచల్‌ లోక్‌సభ నియోజకవర్గాలకు కలిపి 14 మంది పోటీ చేస్తుండగా వారిలో మహిళ ఒక్కరే ఉన్నారు. 50 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ఎనిమిది మందే మహిళలు. వీరిలో నలుగురిని భాజపా, ముగ్గురిని కాంగ్రెస్‌ బరిలో దింపగా మరొకరు స్వతంత్ర అభ్యర్థి. ఇంతవరకు అరుణాచల్‌ నుంచి రాజ్యసభకు వెళ్లినవారిలో మహిళ ఒక్కరంటే ఒక్కరే (ఒమెమ్‌ మొయాంగ్‌ దేవ్రీ) ఉన్నారు. అదీ 1984లో. 1987లో పూర్తిస్థాయి రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు ఎమ్మెల్యేలుగా ఎన్నికైన స్త్రీలు 15 మంది. శాసనసభలో తగినంత మంది మహిళా సభ్యులే లేనప్పుడు, నిర్ణాయక ప్రక్రియలో భాగస్వామ్యం కల్పించనప్పుడు వారి సమస్యలు ఎలా పరిష్కారమవుతాయని అరుణాచల్‌ప్రదేశ్‌ రాష్ట్ర మహిళా కమిషన్‌ అధ్యక్షురాలు కెంజుమ్‌ పకం ప్రశ్నిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని