ఆజాద్‌పై మెహబూబా ముఫ్తీ పోటీ

లోక్‌సభ ఎన్నికల్లో పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ అనంత్‌నాగ్‌-రాజౌరి స్థానంలో డెమొక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ ఆజాద్‌ పార్టీ(డీపీఏపీ) అధ్యక్షుడు గులాం నబీ ఆజాద్‌పై పోటీ చేయనున్నారు.

Updated : 08 Apr 2024 06:13 IST

మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన పీడీపీ

శ్రీనగర్‌: లోక్‌సభ ఎన్నికల్లో పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ అనంత్‌నాగ్‌-రాజౌరి స్థానంలో డెమొక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ ఆజాద్‌ పార్టీ(డీపీఏపీ) అధ్యక్షుడు గులాం నబీ ఆజాద్‌పై పోటీ చేయనున్నారు. జమ్మూ-కశ్మీర్‌లో కొత్తగా ఏర్పడిన ఈ స్థానం ఇద్దరు మాజీ ముఖ్యమంత్రుల పోరుకు వేదిక కాబోతోంది. ఈ మేరకు పీడీపీ పార్లమెంటరీ బోర్డు నేత సర్తాజ్‌ మద్ని, మెహబూబా ముఫ్తీ ఆదివారం విలేకరుల సమావేశంలో కశ్మీర్‌లోని మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. శ్రీనగర్‌ నుంచి పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు వాహీద్‌ పారా, బారాముల్లా నుంచి మిర్‌ ఫయాజ్‌ పోటీ చేయనున్నారు. జమ్మూ పరిధిలోకి వచ్చే జమ్ము, ఉధంపూర్‌ స్థానాల్లో కాంగ్రెస్‌కు పీడీపీ మద్దతు ఇస్తుందని వారు తెలిపారు. అనంత్‌నాగ్‌-రాజౌరి స్థానంలో ఇండియా కూటమిలోని కాంగ్రెస్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌(ఎన్‌సీ) కార్యకర్తలు తనకు మద్దతు ఇవ్వాలని మెహబూబా ముఫ్తీ కోరారు. మరోవైపు ఎన్‌సీ ఇప్పటికే ఈ నియోజకవర్గానికి అభ్యర్థిని ప్రకటించింది. కూటమిలోని పార్టీపై పోటీ గురించి ఆమెను ప్రశ్నించగా..తమకు మరో అవకాశం లేదని, బంతి నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు ఫరూఖ్‌ అబ్దుల్లా కోర్టులోనే ఉందని చెప్పారు. వారు అన్ని స్థానాల్లో పోటీ చేసినా అభ్యంతరం లేదని దీనిపై ముందుగా తమను సంప్రదించి ఉంటే బాగుండేదన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు