నా కుమారుడు ఓడిపోవాలి

కేరళలోని పథనంథిట్ట నుంచి భాజపా తరఫున లోక్‌సభకు పోటీచేస్తున్న తన కుమారుడు అనిల్‌ కె. ఆంటోనీ గెలవకూడదని ఆయన తండ్రి, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు ఏకే ఆంటోనీ ఆకాంక్షించారు.

Published : 10 Apr 2024 06:30 IST

కేరళలోని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఏకే ఆంటోనీ ఆకాంక్ష

తిరువనంతపురం, పథనంథిట్ట: కేరళలోని పథనంథిట్ట నుంచి భాజపా తరఫున లోక్‌సభకు పోటీచేస్తున్న తన కుమారుడు అనిల్‌ కె. ఆంటోనీ గెలవకూడదని ఆయన తండ్రి, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు ఏకే ఆంటోనీ ఆకాంక్షించారు. ఈ నియోజకవర్గంలో భాజపా ఓడిపోవాలని, తన కుమారుడి ప్రత్యర్థి, కాంగ్రెస్‌ అభ్యర్థి అయిన ఆంటో ఆంటోనీ విస్పష్టమైన మెజారిటీతో విజయం సాధించాలని అన్నారు. ‘‘కాంగ్రెస్‌ పార్టీ నా మతం’’ అని మాజీ రక్షణ మంత్రి అయిన 83 ఏళ్ల ఏకే ఆంటోనీ పేర్కొన్నారు. ప్రస్తుత ఎన్నికలు భారత్‌, దాని రాజ్యాంగ పరిరక్షణకు సంబంధించిన ఎన్నికలు అయినందునే తన వైఖరిని స్పష్టం చేసేందుకు ఆరోగ్య సమస్యలను సైతం పక్కనబెట్టి మీడియా సమావేశంలో మాట్లాడేందుకు వచ్చినట్లు వెల్లడించారు. ఇది చావో రేవో తేల్చుకునే పోరాటమని వ్యాఖ్యానించారు. ఆరోగ్య సమస్యల కారణంగా తిరువనంతపురం నుంచి బయటకు వెళ్లి కాంగ్రెస్‌ పార్టీ తరఫున ప్రచారం చేయలేకపోతున్నానని, తాను ప్రచారం చేయకున్నా పథనంథిట్టలో కాంగ్రెస్‌ అభ్యర్థి ఆంటో ఆంటోనీ విస్పష్టమైన మెజారిటీతో విజయం సాధిస్తారని ఏకే ఆంటోనీ ధీమా వ్యక్తం చేశారు.

నా విజయం ఖాయం: అనిల్‌ ఆంటోనీ

తన తండ్రి వ్యాఖ్యలపై స్పందించిన అనిల్‌ ఆంటోనీ.. కాంగ్రెస్‌ పార్టీలో కాలం చెల్లిన నేతలు ఉన్నారని, తన తండ్రి పరిస్థితిని చూస్తే జాలేస్తోందని వ్యాఖ్యానించారు. పథనంథిట్టలో తన విజయం ఖాయమని స్పష్టంచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని