ప్రచారసభల్లో అదరగొడుతున్న ములాయం మనవరాలు

ఉత్తర్‌ప్రదేశ్‌లో పోటాపోటీగా సాగుతున్న లోక్‌సభ ఎన్నికల పోరులో రాజకీయ యోధుడు ములాయంసింగ్‌ యాదవ్‌ కుటుంబంలోని మూడో తరం ప్రచారానికి దిగింది.

Updated : 11 Apr 2024 08:12 IST

ఈటీవీ భారత్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లో పోటాపోటీగా సాగుతున్న లోక్‌సభ ఎన్నికల పోరులో రాజకీయ యోధుడు ములాయంసింగ్‌ యాదవ్‌ కుటుంబంలోని మూడో తరం ప్రచారానికి దిగింది. మైన్‌పురీ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ సతీమణి డింపుల్‌ యాదవ్‌కు మద్దతుగా వారి కుమార్తె ఆదితి యాదవ్‌ ఎన్నికల ప్రచారంతో ఆకట్టుకొంటున్నారు. లండన్‌లో చదువుకొంటూ సెలవుల్లో ఇంటికి వచ్చిన ఆదితి తన తల్లికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. పదునైన ప్రసంగాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న ఆదితిని చూసేందుకు ఓటర్లు ఉత్సాహం చూపుతున్నారు. ములాయంసింగ్‌ మరణానంతరం ఈ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో డింపుల్‌ యాదవ్‌ విజయం సాధించారు. ప్రస్తుతం మైన్‌పురీ ఎంపీగా ఉన్న డింపుల్‌ గెలుపు ఈసారి అంత సులభం కాదన్న విశ్లేషణల నేపథ్యంలో ఆదితి తన ప్రసంగాల్లో భాజపాను, ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని