భాజపా.. స్వచ్ఛమైన బంగారం... కాంగ్రెస్‌.. తుప్పుపట్టిన ఇనుము

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చిన పార్టీ భాజపాయేనని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు.

Updated : 12 Apr 2024 06:16 IST

సత్నా ఎన్నికల సభలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ వ్యాఖ్యలు

సత్నా: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చిన పార్టీ భాజపాయేనని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. అయోధ్య ఆలయ నిర్మాణాన్ని ఉదహరిస్తూ ఆయన ఈ మాటలన్నారు. దేశాన్ని కాంగ్రెస్‌ పార్టీ 50ఏళ్ల పాటు పాలించిందని గుర్తు చేస్తూ.. ‘అర్ధ శతాబ్దం అంటే తక్కువ సమయమేమీ కాదు. పాలన సక్రమంగా సాగి ఉంటే ఆ వ్యవధిలో భారత్‌ను అగ్రస్థానంలో నిలపడం సాధ్యమయ్యేదే’నని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లోని సత్నాలో గురువారం నిర్వహించిన ఎన్నికల సభలో ఆయన ప్రసంగించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు అన్నింటినీ నెరవేర్చిన ఏకైక పార్టీ భాజపాయేనని చెబుతూ....‘అందుకే భాజపా స్వచ్ఛమైన బంగారం..కాంగ్రెస్‌ తుప్పుపట్టిన ఇనుము’ అని పేర్కొన్నారు. కమలదళంలో అందరూ మచ్చలేని వారేనని తాను చెప్పటం లేదన్నారు. అయితే, ‘మన దేశంలోనే కానీ, ప్రపంచంలో కానీ వైఫల్యాలకు సంబంధించి భాజపా వైపు వేలెత్తి చూపేవారెవరూ లేరని’ రక్షణ మంత్రి ధీమా వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని