హామీలు మరిచిపోయిన రేవంత్‌

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేకపోతున్నారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఆరోపించారు. మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామని, రైతులకు క్వింటాల్‌కి రూ.500 బోనస్‌ ఇస్తానని చెప్పిన మాటలను మరిచిపోయారని విమర్శించారు.

Updated : 13 Apr 2024 06:26 IST

ఎన్నికలయ్యాక ఉచిత బస్‌ పథకం ఉండదు
బలహీన వర్గాల అభ్యర్థి క్యామ మల్లేష్‌ను గెలిపించండి: కేటీఆర్‌

ఆదిభట్ల, తుర్కయాంజాల్‌ పురపాలిక, న్యూస్‌టుడే: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేకపోతున్నారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఆరోపించారు. మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామని, రైతులకు క్వింటాల్‌కి రూ.500 బోనస్‌ ఇస్తానని చెప్పిన మాటలను మరిచిపోయారని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత మహిళలకు ఉచిత బస్‌ పథకానికి స్వస్తి పలకనున్నారని చెప్పారు. తెలంగాణ అభివృద్ధిని మాటల్లో కాకుండా ఆచరణలో చూపెట్టిన ఒకే ఒక నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని అన్నారు. భారాస భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశం శుక్రవారం బొంగుళూరులో జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన కేటీఆర్‌ మాట్లాడుతూ.. బలహీన వర్గాల ప్రజలకు రాజకీయాల్లో ప్రాధాన్యం ఉండాలని క్యామ మల్లేష్‌ను కేసీఆర్‌ భువనగిరి ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టారన్నారు. భారాస హయాంలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి కృషి చేశామని గుర్తు చేశారు. విద్యారంగానికి పెద్దపీట వేసి నాణ్యమైన విద్యను అందించేందుకు గురుకులాలను పెంచామన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంట్‌ కోతలు ప్రారంభమయ్యాయన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని అన్నారు. అందరికీ అందుబాటులో ఉండే క్యామ మల్లేష్‌ గెలుపును కార్యకర్తలు తమ గెలుపుగా భావించి పని చేయాలని కోరారు. కార్యక్రమంలో భారాస రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని