వాలంటీర్లందరూ వైకాపా కార్యకర్తలే!.. రాజీనామా చేయించండి: మంత్రి ధర్మాన

‘వాలంటీర్లందరూ వైకాపా కార్యకర్తలే. వారితో రాజీనామా చేయించి ఎన్నికల్లో పాల్గొనేలా నేతలు చూడాలి’ అని మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు.

Published : 13 Apr 2024 06:11 IST

ఈనాడు డిజిటల్‌-శ్రీకాకుళం, న్యూస్‌టుడే-అరసవల్లి: ‘వాలంటీర్లందరూ వైకాపా కార్యకర్తలే. వారితో రాజీనామా చేయించి ఎన్నికల్లో పాల్గొనేలా నేతలు చూడాలి’ అని మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం నగరంలోని ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌ హాల్లో శుక్రవారం నిర్వహించిన వైకాపా విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ఎన్నికల్లో వాలంటీర్లు పాల్గొనేలా చూడండి. కేసులు అడ్డువస్తాయనుకుంటే రాజీనామా చేయండని చెప్పండి. కార్యకర్తల్లా పని చేస్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి ఏం చేయాలో చూద్దాం. సామాన్యమైన ఓటరు ఎవరో ఒకరు అడగాలి కదా అనుకుంటాడు. మనం ఇప్పుడే కదా వారికి కనిపించేది. మళ్లీ అయిదు సంవత్సరాల తర్వాత కనిపిస్తాం. రాజీనామా చేసిన వాలంటీర్లు 50 ఇళ్ల నుంచి 25 మందిని నామినేషన్‌ కార్యక్రమానికి తీసుకురావాలని చెప్పండి. ఎన్నికల్లో పోల్‌ మేనేజ్‌మెంట్‌ చేసే వారే ఇబ్బందికరంగా ఉన్న నియోజకవర్గాల్లోనూ విజయం సాధిస్తారు’ అని ధర్మాన పేర్కొన్నారు. వైకాపా ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ‘సచివాలయ ఇన్‌ఛార్జి ఆధ్వర్యంలో 85 సంవత్సరాల వయసు కలిగిన వృద్ధులు, దివ్యాంగులను గుర్తించి వారితో ఓటు వేయించేలా చూడాలి’ అని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని