తెదేపాలోకి 40 మంది వాలంటీర్లు

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో వాలంటీర్లు 40 మంది మూకుమ్మడిగా తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు.

Published : 13 Apr 2024 05:14 IST

నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట), న్యూస్‌టుడే: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో వాలంటీర్లు 40 మంది మూకుమ్మడిగా తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. పట్టణ తెదేపా ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి క్యాంప్‌ కార్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో వారంతా పార్టీలో చేరారు. వారికి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు నియోజకవర్గం తెదేపా అభ్యర్థి ప్రశాంతిరెడ్డి దంపతులు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. విడవలూరు మండల పరిధిలో పనిచేస్తున్న ఈ 40 మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా తెదేపాలో చేరారని ప్రశాంతిరెడ్డి తెలిపారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే తమకు రూ.10 వేల జీతం వస్తుందని వారు నమ్ముతున్నట్లు వివరించారు. స్థానిక వైకాపా నాయకులు కొందరు మహిళలతో ప్రవర్తిస్తున్న తీరు సక్రమంగా లేదని వాలంటీర్లు చెప్పినట్లు తెలిపారు. చంద్రబాబుతోనే అభివృద్ధి జరుగుతుందని భావించి తెదేపాలో చేరినట్లు కొందరు వాలంటీర్లు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని