బారాముల్లా బరిలో ఒమర్‌ అబ్దుల్లా

జమ్మూ-కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా బారాముల్లా లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్‌సీ) ప్రకటించింది.

Published : 13 Apr 2024 05:15 IST

శ్రీనగర్‌ నియోజకవర్గం నుంచి షియా నేత ఆగా సయ్యద్‌
నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ప్రకటన

శ్రీనగర్‌: జమ్మూ-కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా బారాముల్లా లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్‌సీ) ప్రకటించింది. షియా నాయకుడు ఆగా సయ్యద్‌ రుహుల్లా మెహదీ సెంట్రల్‌ కశ్మీర్‌లోని శ్రీనగర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు పార్టీ అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా శుక్రవారమిక్కడ విలేకరులకు తెలిపారు. జమ్మూ-కశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించకపోతే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని ఒమర్‌ అబ్దుల్లా గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు, 2009 సార్వత్రిక ఎన్నికల తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో ఒమర్‌ పోటీ చేయడం ఇదే మొదటిసారి. శ్రీనగర్‌కు మే 13న, బారాముల్లాకు మే 20న పోలింగ్‌ జరగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని