’మూడో దశ పోలింగ్‌కు నామినేషన్ల స్వీకరణ షురూ

లోక్‌సభ ఎన్నికల్లో మూడో దశ పోలింగ్‌ కోసం నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. ఈ దశలో భాగంగా దేశవ్యాప్తంగా 94 నియోజకవర్గాల్లో మే 7న ఓటింగ్‌ జరగనుంది.

Published : 13 Apr 2024 05:16 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో మూడో దశ పోలింగ్‌ కోసం నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. ఈ దశలో భాగంగా దేశవ్యాప్తంగా 94 నియోజకవర్గాల్లో మే 7న ఓటింగ్‌ జరగనుంది. జాబితాలో ఉత్తర్‌ప్రదేశ్‌, మహారాష్ట్ర, బిహార్‌, పశ్చిమ బెంగాల్‌, మధ్యప్రదేశ్‌, కర్ణాటక, గుజరాత్‌, ఛత్తీస్‌గఢ్‌ తదితర రాష్ట్రాల్లోని స్థానాలు ఉన్నాయి. నామినేషన్ల సమర్పణకు ఈ నెల 19 చివరి తేదీ. 22 వరకు వాటిని ఉపసంహరించుకునే వీలుంటుంది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలు మొత్తంగా ఏడు దశల్లో జరగనున్న సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని