మధ్యంతర బెయిల్‌ ఇవ్వండి.. ఎన్నికల ప్రచారానికి వెళ్తా

దిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన ఆప్‌ నేత మనీశ్‌ సిసోదియా ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు తనకు అనుమతినివ్వాలని కోరుతూ శుక్రవారం దిల్లీ కోర్టును ఆశ్రయించారు.

Published : 13 Apr 2024 05:16 IST

దిల్లీ కోర్టును ఆశ్రయించిన సిసోదియా

దిల్లీ: దిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన ఆప్‌ నేత మనీశ్‌ సిసోదియా ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు తనకు అనుమతినివ్వాలని కోరుతూ శుక్రవారం దిల్లీ కోర్టును ఆశ్రయించారు. ఇందుకోసం మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేయవల్సిందిగా పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ అభ్యర్థనను విన్న ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా..బెయిల్‌ పిటిషన్‌పై తమ సమాధానాలను కోర్టుకు సమర్పించాలని ఈడీ, సీబీఐలకు నోటీసులు జారీ చేసింది. అనంతరం విచారణను ఈ నెల 20కు వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని