నేటి నుంచి బాలకృష్ణ ‘స్వర్ణాంధ్ర సాకార యాత్ర’

సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శనివారం నుంచి ‘స్వర్ణాంధ్ర సాకార యాత్ర’ పేరుతో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

Published : 13 Apr 2024 06:08 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శనివారం నుంచి ‘స్వర్ణాంధ్ర సాకార యాత్ర’ పేరుతో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఎన్డీయే అభ్యర్థుల విజయం కోసం రాయలసీమలో ఆయన విస్తృతంగా పర్యటిస్తారు. ఇందుకోసం ‘బాలయ్య అన్‌స్టాపబుల్‌’ పేరుతో ప్రత్యేకంగా ఓ బస్సును రూపొందించారు. ‘ఈ ఎన్నికల్లో హిందూపురం అసెంబ్లీ స్థానం నుంచి తెదేపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న బాలకృష్ణ ఏప్రిల్‌ 19న నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఈ నెల 25 నుంచి ఆయన ఉత్తరాంధ్రలో ప్రచారం నిర్వహిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని